Dichpally: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా ఊర పండుగ!
Dichpally: ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఘనంగా ఊర పండుగ. పాడిపంటలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు.
Dichpally: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా ఊర పండుగ!
Dichpally: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో ఆదివారం రోజున గ్రామ ప్రజలందరూ కలిసి ఘనంగా ఊర పండుగ నిర్వహించారు.వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండాలని, ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉండడానికి, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత మూర్తులకు పూజలు చేశారు.
ఈ పండుగ కోసం ప్రత్యేక కల్ప తో పోచమ్మ, మైసమ్మ, భూలక్ష్మి, ముత్యాలమ్మ తదితర గ్రామ దేవతల విగ్రహాలను తయారు చేశారు.అమ్మవారి ఊరేగింపులు, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు, తొట్లు సమర్పించడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.
గ్రామ దేవతలకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లొక్కడి యాదగిరి, , గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆసది రవీందర్, కొంగ రాజరెడ్డి, మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, బూస సుదర్శన్, రామాలయ కమిటీ చైర్మన్ ఏ.జీ దాస్, గంగ సాయిలు,బొత్త సాయిలు,దోర్నాల అనిల్, సంజీవ్, సాయికుమార్, సుర శ్యామ్, సాగర్, పోతరాజులు, గ్రామ ప్రజలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




