Nizamabad: ధర్మారంలో ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్మారం (బి) గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకున్నారు.
Nizamabad: ధర్మారంలో ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు!
Nizamabad: ధర్మారం (బి) లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద సంఖ్యలో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలనే సందేశాన్ని చాటిచెప్పారు. పూల పండుగైన బతుకమ్మ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.




