Dichpally: ఘనపూర్‌లో ఘనంగా జీపీఎల్ ముగింపు.. క్రీడా స్ఫూర్తిని చాటిన యువత!

Dichpally: డిచ్‌పల్లి మండలం ఘనపూర్‌లో ఘనంగా ముగిసిన జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్.

M. RAMESH,NIZAMABAD
Published on: 13 Jun 2026 1:22 PM IST
Dichpally
X

Dichpally: ఘనపూర్‌లో ఘనంగా జీపీఎల్ ముగింపు.. క్రీడా స్ఫూర్తిని చాటిన యువత!

Dichpally: డిచ్‌పల్లి మండలం ఘనపూర్ గ్రామంలో గత నెల 24న ప్రారంభమైన 'ఘనపూర్ ప్రీమియం లీగ్' (GPL) క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు ఎస్సై ఎం.డీ ఆరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై ఆరీఫ్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, క్రీడాకారుల మధ్య సోదరభావాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. టోర్నమెంట్‌ను ఎంతో పకడ్బందీగా నిర్వహించిన నిర్వాహకులు సాయినాథ్, దాసు, కృష్ణ, ఓంప్రసాద్, సాగర్, రాజు, గంగామోహన్ మరియు ఇతర సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ముగింపు కార్యక్రమంలో ఎస్సై ఆరీఫ్, డాక్టర్ దీపక్, రాథోడ్ మరియు డిప్యూటీ ఎంఆర్వో మునీర్ పాల్గొని, గెలుపొందిన జట్లకు ట్రోఫీలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు, గ్రామ ప్రముఖులు రామకృష్ణ, మల్లయ్య, కపిల్, రమణ, శీను, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story