Jukkal: గుండూరులో ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ!

Jukkal: కామారెడ్డి జిల్లా గుండూరులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆవిష్కరించారు.

VEERANNA, JUKKAL
Published on: 30 April 2026 7:37 PM IST
Jukkal
X

Jukkal: గుండూరులో ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ!

గుండూరు (కామారెడ్డి): డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే నేడు మనమందరం స్వేచ్ఛగా బతుకుతున్నామని జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. గురువారం జుక్కల్ మండలం గుండూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నడి బొడ్డులో 125 పిట్ల ఎత్తుతో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆనాడు అంబేద్కర్ లేకుంటే నేటికి ఎ ఒక్క దళిత కుటుంబం స్వేచ్ఛగా బతికే హక్కు ఉండేది కాదని అందుకే ఆనాడు అంబేద్కర్ కన్నా కలలు నిజం కావాలన్న ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చదివించాలని సూచించారు.

ప్రపంచ మేధావి డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తో నేడు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు, రిజర్వేషన్ లు, సమానత్వం దక్కుతుందన్నారు. ఆయన చేసిన సేవలు ఎన్నటికి మర్చిపోలేనివని అంబేద్కర్ ఆశయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నయని పేర్కొన్నారు.సామాజిక సమానత్వం, విద్య, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా ఉండాలని కొనియాడారు.కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కాశీనత్,ఉప సర్పంచ్ లక్ష్మి బాయి, బాపు రావు, బస్వంత్, జ్ఞాను,మారుతి,మాజి ఎంపిపి బస్వంత్ సెట్కార్,మాజి జడ్పి టి సి కె.పండరి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్,వాస్రే. రమేష్,విఠల్,శంకర్, అవినాష్ పాటిల్, గజానంద్ గౌడ్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story