Sirikonda: కొండూరులో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన.. వైభవంగా ప్రారంభం!

Sirikonda: సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి సమేత నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 22 Jun 2026 11:15 AM IST
Sirikonda
X

Sirikonda: కొండూరులో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన.. వైభవంగా ప్రారంభం!

Sirikonda: సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో గౌడ సంఘ ము ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి సమేత నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టపన వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాన్ని గ్రామం లో డీజే పాటలతో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు చేశారు.

అనంతరం గోధులి సుముహూర్తమున అఖండ దీపారాధన పూజలు చేశారు.4రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు.

సోమవారం గంగా సేకరణ, గోపూజ, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, మంగళవారం రోజున దేవి సూక్తముల మంత్ర స్వాకార హోమం, ప్రాణ ప్రతిష్ట హోమం, చివరి రోజు బుధవారం సుప్రభాత సేవ, అర్చన అభిషేకాలు, శిఖర ప్రతిష్టాపన, ప్రథమ దర్శనం, అనంతరం తీర్థ ప్రసాదల వితరణ కార్యక్రమం జరుగుతుందని వైదిక పురోహిత రత్న, అవార్డు గ్రహీత పురోహితుడు మఠం సంజీవ్ తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story