Rampur: నిజామాబాద్ జిల్లా రాంపూర్‌లో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

Rampur: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో దాండియా నృత్యాలు, సంప్రదాయ పూజలతో దుర్గామాత శోభాయాత్ర అత్యంత వైభవంగా ముగిసింది.

M. RAMESH,NIZAMABAD
Published on: 22 Oct 2026 2:08 PM IST
Rampur
X

Rampur: నిజామాబాద్ జిల్లా రాంపూర్‌లో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

నిజామాబాద్ జిల్లా: డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో నిత్య పూజలు అందుకుని, బుధవారం నాడు దుర్గామాత శోభాయాత్ర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభా మధ్య సాగింది. దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.​ చిన్నారులు, మహిళలు దాండియా, నృత్యాలు చేసుకుంటూ ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర కన్నుల పండుగ గా కొనసాగింది.

ఆడబిడ్డల సంప్రదాయ ఆటపాటల నడుమ సాగిన శోభాయాత్ర గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది.ఊరేగింపులో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD