Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన జి.ఆర్.ఎం.బి చైర్మన్

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టును జి.ఆర్.ఎం.బి చైర్మన్ పి. దోర్జె గ్యాంబ సందర్శించారు.

VEERANNA, JUKKAL
Published on: 3 May 2026 9:02 PM IST
Nizamsagar
X

Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన జి.ఆర్.ఎం.బి చైర్మన్

Nizamsagar: నిజాంసాగర్ (కామారెడ్డి) వచ్చే వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) చైర్మన్ పి. దోర్జె గ్యాంబ అన్నారు. ఆదివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టు , స్పిల్ వే గేట్లను పరిశీలించి వాటి నిర్వహణ స్థితి గతులను సమీక్షించారు. అనంతరం ప్రాజెక్ట్ కాలువను సందర్శించి నీటి విడుదల చేసే విధానం పై వివరాలు తెలుసుకున్నారు.

రానున్న వర్షకాలన్నీ దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, వరద నీటి నిర్వహణ చర్యలపై అధికారులను ప్రశ్నించి పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు, నీటి విడుదల పై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ కొనసాగాలని వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ప్రణాళిక తో అధికారులు విధులు నిర్వహించాలని స్పిల్ వే గేట్లు సక్రమంగా పని చేసే విధంగా చూడాలని అన్నారు.

ఆయకట్టు కింది రైతులకు అవసరమైన నీటిని సమయానికి అందే విధంగా చూడాలని ఆదేశించారు. కార్యక్రమం లో నీటి పారుదల శాఖ ఎస్ ఇ. బాన్సువాడ దక్షణ మూర్తి, ఈ ఈ జి ఆర్ ఎం బి వేణు, ఈ ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు సోలమన్, ఎ ఈ ఈ లు డి. శివ ప్రసాద్, సాకేత్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story