Nasirullabad: సంగెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ: సర్పంచ్ ఉమారాణి
Nasirullabad: నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సర్పంచ్ ఉమారాణి-వినోద్, ఎంపీడీవో కే. రవీశ్వర్ గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు.
Nasirullabad: సంగెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ: సర్పంచ్ ఉమారాణి
నసురుల్లాబాద్: మండలంలోని సంగెం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఉమారాణి–వినోద్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల స్థలాలకు ముగ్గు పోసి భూమిపూజ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించుకునేలా లబ్ధిదారులకు గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టి పూర్తి చేసుకునేలా లబ్ధిదారులు ముందుకు రావాలని కోరారు.
అధికారులు మాట్లాడుతూ. మంజూరైన ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు నిబంధనలు పాటించాలని, నిర్మాణ పనులను దశలవారీగా చేపట్టి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంత గూడు సమకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకటేశం, ఎంపీడీవో కే. రవీశ్వర్ గౌడ్, ఉపసర్పంచ్ బాధ్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పెద్దలు కిషన్, శివదయాల్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




