Kamareddy: కరెంటు తీగలే మృత్యుపాశాలు.. మర్కల్ శివారులో భీకర ప్రమాదం!
Kamareddy: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ మిషన్ పూర్తిగా దగ్ధమైంది.
Kamareddy: కరెంటు తీగలే మృత్యుపాశాలు.. మర్కల్ శివారులో భీకర ప్రమాదం!
కామారెడ్డి జిల్లా: సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కల్ గ్రామ శివారులో వీర హనుమాన్లు సమీపంలో వరి కోతలు కోసి హార్వెస్టర్ మిషన్ రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఎల్టి వైర్లు క్రిందికి ఉండడంతో హార్వెస్టర్ కు ఒక్కసారిగా తగలడంతో మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకా చక్యంగా తప్పించుకున్నాడు. డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందల్వాయి మండలం చంద్రాయిని పల్లి గ్రామానికి చెందిన సంతోష్ హార్వెస్టర్ గా పోలీసులు గుర్తించారు.
Next Story




