Armoor: ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ
Armoor: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Armoor: ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ
అర్మూర్ న్యూస్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కెట్ లో ధాన్యాన్ని కొనుగోలు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు & ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారు జీవన్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం సందర్శించడంలో రైతుకు టిఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం జరిగింది.
అసలు ఎవరెవరికి వాగ్వాదం ఎందుకు జరిగింది:
ఆర్మూర్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పెర్కిట్ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి సాయంత్రం 4:30 p. M. గంటలకు వస్తానని అక్కడ ఉన్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ అక్కడికి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు వచ్చాడు, ఇలా రావడంతో అక్కడ ఉన్న రైతు ఇంత రాత్రి వస్తావా అంటూ ఎమ్మెల్యే ని అడగడంతో అక్కడ ఉన్న ఆ పార్టీ నాయకులు అరవకు అనడంతో ఈ విషయం కాస్త వాగ్వాదానికి చోటు చేసుకుంది, ఒకడినొకరు నీది ఏ ఊరు, నీకేం అవసరం అంటూ, కొన్ని దురు వ్యాఖ్యలతో తిట్టుకున్నారు. మాటకు మాట అనుకోవడంతో కాస్త విషయం పెద్దగా మారింది,.
రైతుల యొక్క బాధ :
మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదంటూ ప్రభుత్వం, మేము మా బాధలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మా కొనుగోలు కేంద్రానికి సందర్శిస్తాడు అంటే అది మాకు మంచి విషయం, కానీ సమయం ఏం టైం కీ చెప్పి,ఏ టైం కి వచ్చాడు, ఆలా ఆలస్యం కావడంతో, రైతు ఆసనహనికి గురయ్యారు, అది కాస్త బి ఆర్ స్ నాయకులకు,రైతుకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది, ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అంటూ రైతు యొక్క ఆవేదన, మొత్తానికైతే నిన్న రాత్రి జరిగిన కేంద్ర పరిశీలనలో జరిగిన సంఘటన నియోజవర్గ ప్రజలకు చర్చనీఅంశంగా మారింది.




