Bodhan: బాలయోగి కృష్ణ మహారాజ్ రాక.. రాకాసిపేట్‌లో ఆధ్యాత్మిక సందడి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్‌లో మే 2వ తేదీ శనివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు.
Bodhan: బాలయోగి కృష్ణ మహారాజ్ రాక.. రాకాసిపేట్‌లో ఆధ్యాత్మిక సందడి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ హనుమాన్ మందిరం భక్తి పరవశంతో కళకళలాడనుంది. హిందూ సమ్మేళనాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తోకల ధ్రువకుమార్ఈ పేర్కొన్నారు. మంగళవారం పట్టణం లోని రాక సి పేటలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పవిత్ర కార్యక్రమం రెండో తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు కాకయ్య మఠం మందిరం ప్రాంగణంలో జరగనుంది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు ఏకస్వరంతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తూ భగవంతుని కృపాకటాక్షాలను కోరనున్నారు. భక్తి భావంతో నిండిన ఈ సమూహ పారాయణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చనుంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందించనున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తోకాల ధృవ కుమార్ మాట్లాడుతూ, ప్రతి భక్తుడు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ స్వామి కృపను పొందాలని పిలుపునిచ్చారు.
కౌరవ అధ్యక్షులుగా గుంజరి రాములు, కోశాధికారిగా బిల్లా శంకర్, కార్యదర్శిగా మల్లెపూల ప్రభాకర్ సేవలు అందిస్తున్నారు. ప్రధాన వక్తగా రుద్రోజు శ్రీనివాస్ గారు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారు.
అలాగే హిందూ వాహిని తెలంగాణ తరఫున శ్రీ ఉదయ్ మహారాజ్, యోగ్ ధారణ ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని భక్తి మయంగా తీర్చిదిద్దనున్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని, భక్తి మార్గంలో ముందుకు సాగాలని నిర్వాహకులు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.




