Banswada: బాన్సువాడలో హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదానం!

Banswada: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. యువకుల విశేష స్పందన.

SALEEM, BANSWADA
Published on: 8 Sept 2026 1:46 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదానం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ,హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్సువాడ శాఖ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సొసైటీ నిర్వాహకులు హాఫిజ్ షకీల్ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం,ప్రాణ హాని ఉన్న వారికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడటం,బీద వారికి ఆదుకోవడం అని అన్నారు. యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రక్త దానం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మౌలానా రిజ్వాన్ సాబ్ తో పాటు హాఫిజ్ షకీల్ ,కౌన్సిలర్ లయీక్,మహమ్మద్ షరీఫ్,హాఫిజ్ ఉస్మాన్,హాఫిజ్ ఇంతేజార్,పాషా భాయ్,షేక్ రహ్మత్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story