Bodhan: బోధన్ డివిజన్లో రెండో రోజుకు చేరిన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ రుద్రూర్లో ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది.
Bodhan: బోధన్ డివిజన్లో రెండో రోజుకు చేరిన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె
బోధన్: డివిజన్లో ఐకెపి వివో ఎలా నిరోధిక సమ్మె మంగళవారం నాటికి రెండోరోజు చేరు కుంది. తమ న్యాయమైన సమస్యల కోసం శాంతియుతంగా సమ్మెను ప్రారంభించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల భవన కార్యాలయం ఎదుట వివో ఏ లు సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ. 25000 వేతనాలు అందించడంతోపాటు జీవో నెంబర్ 58 సవరించాలని డిమాండ్ చేశారు.
తమకు 20 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తూ అర్హులైన వివోఏలకు సీసీ లోగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చాలీచాలని వేతనాలతో పోరాటం చేస్తున్న ఐ కెపి సిబ్బందిని అన్ని విధాల ఆదుకోవాలని విన్నవించారు.
డ్వాక్రా సంఘల సమస్యలను పరిష్కరించడంలో తాము వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని డ్వాక్రా సంఘాల సమస్యలను పరిష్కరించడంతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలను సైతం ఇప్పించేందుకు పాటుపడుతున్నామని అయినప్పటికీ ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మెలో వి ఏ ఓ లు కమల, స్వరూప, స్వప్న, గంగాధర్, సాయిబాబా గౌడ్, తో పాటు వివిధ గ్రామాల వి ఏవోలు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు.




