Navipet: ఆకులో ఆసునై.. జీవితాలతో జూద మాట.. నవీపేట్ మండల్ లో జోరుగా పేకాట

Navipet: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో జోరుగా పేకాట. కుటుంబాలను రోడ్డున పడేస్తున్న నిర్వాహకులు.

K RAVI, BODHAN
Published on: 28 May 2026 1:24 PM IST
Navipet
X

Navipet: ఆకులో ఆసునై.. జీవితాలతో జూద మాట.. నవీపేట్ మండల్ లో జోరుగా పేకాట

నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండల్ లోని పలు అటవి ప్రాంతాల్లో జోరుగా పేకాట కొనసాగుతుంది. మండలంలోని ఫకిరాబాద్, యంచా, నందిగావ్, అల్జపూర్, పోతంగల్ శివార్లలో జోరుగా పేకాట కొనసాగుతున్నట్లు విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక ఏజెంట్లు నిర్వహించి పేకాట స్థావరాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నట్లు. పేకాట మూలంగా అనేక కుటుంబాల్లో వివాదాలు చెలరేగడంతో పాటు సంసారాలు రోడ్డున పడుతున్నాయి. పేకాట అంగీర్వాకులు పేకాటరాయుళ్ల కోసం ఈ ఈ ప్రాంతంలో ఉన్న గుట్టల వైపు ప్రత్యేక నిఘ ను ఏర్పాటు చేసుకుని మూడు ఆకులు ఆరు ముక్కలుగా పుష్కలంగా పేకాట కొనసాగుతోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లకు రోజుకు రూ. 1500 కూలి చెల్లించడంతోపాటు మద్యం బిర్యాని సైతం వసతులు కల్పిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. నిర్వాహకులు పేకాట రాయుళ్ల కు సైతం మందు విందు తోపాటు ప్రత్యేక వాహనాల సదుపాయాన్ని కల్పిస్తూ వారి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. పేకాట నిర్వాహకులకు పోలీసులు సైతం ఏజెంట్లుగా ఉన్నట్లు విమర్శలు తలెత్తుతున్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు అటువైపు వెళ్ళినట్లయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు ముందస్తు సమాచారం పేకాటనిర్వాకులకు పేకాటరాయుళ్లను ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు స్పష్టమవుతుంది.

లక్షల్లో చేతులు మారుతున్న డబ్బులు: పేకాట స్థావరం వద్ద లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. 1000 కి 2000 చొప్పున డబ్బులు కట్ చేసుకొని పేకాట ఆడేవారికి పేకాట స్థావరం వద్ద డబ్బులు ఇస్తూ పేకాటను కొనసాగిస్తున్నారని ఆయా ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు.

విచ్చిన మౌతున్న కుటుంబాలు:

పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న పేకాట రాయులు ఇల్లల్లో కి వెళ్లి తల్లిదండ్రులు, భార్య కుటుంబాల్లో గొడవలు పెట్టుకుని హత్యలు,ఆత్మహత్యల సైతం పాల్పడుతున్నారు.

మంగళ సూత్రాలు తాకట్టుపెట్టి పేకాటలో పాల్గొనేందుకు భార్యల మెడలో బంగారు ఆభరణాలు మంగళ సూత్రాలను సైతం పేకాట స్థావరం వద్దని తాకట్టు పెట్టి పేకాట ఆడుతున్నారు. మరికొందరు పట్టా భూములు ప్లాట్ల డాక్యుమెంట్లు వాహనాలను సైతం తాకట్టు పెట్టి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.

పోలీసు శాఖలో సైతం రూపొందించే వారు ఉన్నట్లు పలు ఆరోపణ వెలువెత్తుతున్నాయి. తాము ప్రతి ఒక్కరికి ముడుపులు ముట్టజెప్పి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని ఎవరికి జంకాల్సిన అవసరం లేదంటూ పేకాటనిర్వాకుడు బాహాటంగా చెప్పినట్లు విమర్శలు సైతం ఉన్నాయి.

అటు పోలీసులకు ఇటు పేకాట నిర్వాహకులకు ఏజెంట్ గా ఓ సోషల్ మీడియా నిర్వాకుడు పనిచేస్తున్నట్లు ఘాటుగా విమర్శలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పనిచేస్తున్న సదరు వ్యక్తి సైతం ఈ పేకాట స్థావరాలను తానే స్వయంగా ఏర్పాటు చేస్తున్నట్లు మండలంలో కోడైకూ స్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story