Nizamabad: అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఇందల్వాయి అగ్నిమాపక సిబ్బంది

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఇందల్వాయి అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 14 Jun 2026 10:30 AM IST
Nizamabad
X

Nizamabad: అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఇందల్వాయి అగ్నిమాపక సిబ్బంది

నిజామాబాదు: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలని ఫైర్ స్టేషన్ అధికారి నర్సయ్య అన్నారు.డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద అగ్రిప్రమాద భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా పొగతాగడం, విద్యుత్ షార్ట్ స ర్క్యూట్, వంటగ్యాస్ లీకేజీల వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు.

ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అధిక ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్ర త్తలను వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఏవిధంగా ఆర్పాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన లో డిచ్ పల్లి CI వినోద్, ఎస్సై అరిఫ్, అగ్నిమాపక పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story