Khajapur: సోయాబీన్‌లో పార్థీనియం నివారణపై రైతులకు అవగాహన

Khajapur: సాలూర మండలం ఖాజాపూర్ గ్రామంలో సోయాబీన్ పంటలో పార్థీనియం (వయ్యారి భామ) నివారణపై రైతులకు అవగాహన కల్పించిన జగిత్యాల వ్యవసాయ బి.ఎస్సీ విద్యార్థులు.

K RAVI, BODHAN
Published on: 21 Aug 2026 7:11 PM IST
Khajapur
X

Khajapur: సోయాబీన్‌లో పార్థీనియం నివారణపై రైతులకు అవగాహన

ఖాజాపూర్: సాలూర మండలం ఖాజాపూర్ గ్రామంలో సోయాబీన్ పంటలో పార్థీనియం నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జగిత్యాల వ్యవసాయ బి.ఎస్సీ విద్యార్థులుశుక్రవారం గ్రామంలోని పంట పొలాల్లో సోయాబీన్ లో పెరిగిన పార్థీనియం (వయ్యారి భామ) నివారణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పార్థీనియం కలుపు వల్ల పంటల ఎదుగుదల పైప్రభావం చూపుతుందని విద్యార్థులు వివరించరు. రైతులు పొందే , దిగుబడిపై కలిగే ప్రభావంతో పాటు మనుషు లతో పాటు పశువుల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల గురించి రైతులకు వివరించారు.

పార్థీనియం కలుపును ప్రారంభ దశలోనే తొలగించడం ద్వారా పంటతో పోటీని తగ్గించవచ్చని విద్యార్థులు తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు కూడా చురుకుగా పాల్గొని, విద్యార్థులతో కలిసి పార్థీనియం కలుపు తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కలుపు నివారణ, పంట పొలాల పరిశుభ్రత మరియు సమయానుకూల కలుపు యాజమాన్యంపై అవగాహన కలిగింది.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story