Banswada: రుద్రూర్ గ్రామ పంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
Banswada: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Banswada: రుద్రూర్ గ్రామ పంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
బాన్సువాడ: రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ కర్త, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయ శంకర్ 92 వ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్, జూనియర్ అసిస్టెంట్ నవ్యత, తెలంగాణ ఉద్యమ కారుడు ఓబుల సాయన్న, బచ్చు పండరి, జయమ్మ, గోపి తదితరులు పాల్గొన్నారు.
Next Story




