Jukkal: జుక్కల్‌లో జొన్న కొనుగోలు కేంద్రాలు షురూ.. మద్దతు ధర ఎంతంటే?
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
Jukkal: జుక్కల్‌లో జొన్న కొనుగోలు కేంద్రాలు షురూ.. మద్దతు ధర ఎంతంటే?
Jukkal: బిచ్కుంద (కామారెడ్డి) జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, మొహమ్మద్ నగర్, పుల్కల్, పత్ల పూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, రైతు సేవ సహకార సంఘలలో బుధవారం జొన్న కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ ల చేతుల మీదుగా ప్రారంభించారు. బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో రైతు సేవ సహకార సంఘం అధ్యక్షుడు నల్చార్ బాలు శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి ల చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించగా మున్సిపల్ చైర్మన్ సీమ సెట్కార్, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులు పండించిన జొన్న పంట కు క్వింటాలుకు 3.699 రూపాయల ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం జరిగిందని రైతులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ జొన్న పంట ను విక్రయించాలని రైతులకు సూచించారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం పట్ల కొంత సంతృప్తి ఉన్న ఎకరానికి 10 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని షరతు విధించడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి పంట దిగుబడి రైతులు ఊహించని విధంగా దిగుబడి ఎక్కువగా రావడంతో ప్రభుత్వం 10 క్వింటాల్ కు పరిమితి విధించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం 10 క్వింటాల్ కు బదులు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని కోరుతున్నారు. లేని పక్షంలో మిగిలిన పంటను విక్రయించేందుకు మధ్య దళారులను ఆశ్రయించి రైతులు మోసపోయే అవకాశం ఉందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్,పి సి సి డెలిగేట్ విఠల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దర్పాల్ గంగాధర్,నాహుషా నాయక్, మార్కెట్ డైరెక్టర్ సాయిని అశోక్, రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ యాదవ్ రావు,సి ఇ ఓ శ్రవణ్ కుమార్, కో ఆప్షన్ సభ్యుడు చింతల్ హన్మండ్లు, లింగురం, ఉత్తమ్ మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




