Nizamabad: ప్రజా గొంతుకలకు భరోసా కల్పించండి.. జర్నలిస్టుల సంఘాల డిమాండ్
Nizamabad: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రక్షణ చట్టం మరియు ఆరోగ్య బీమా కల్పించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.
Nizamabad: ప్రజా గొంతుకలకు భరోసా కల్పించండి.. జర్నలిస్టుల సంఘాల డిమాండ్
Nizamabad: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల గంతుకగా, సమాజానికి అద్దంగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.రాష్ట్రం జిల్లాల పరిధిలో ఆర్ఎస్ఐ (RNI) నమోదు కలిగిన అన్ని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి అని కోరారు.
అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా (ఇన్ఫూరెన్స్) పదకం అమలు చేయాలని కోరారు.ప్రస్తుతం జిల్లా స్థాయికి పరిమితమైన బస్సు పాసులను రాష్ట్రవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా అమలు చేయాలని అన్నారు.కరేనా సమయంలో అమలు చేసిన విధంగా రైల్వే ప్రయాణ పాసులు కూడా జర్నలిస్టులకు పునరుద్ధరించాలి.విది నిర్వహణలో మృతి చెందిన జర్న లిస్టుల కుటుంబాలకు ఇల్లు, కుటుంబ పెన్షన్ ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.జర్న లిస్టుల పిల్లలకు ఉచిత విద్య లేదా పీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించాలి.జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా గృహ నిర్మాణ పదకాల్లో ప్రత్యేక కోటా కల్పించాలి.వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక నెలవారీ గౌరవ వేతనం / పెన్షన్ అమలు చేయాలి.విధి నిర్వహణ సమయంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు.ఫీల్డ్ రిపోర్టర్లకు అవసరమైన భద్రతా పరికరాలు, అత్యవసర సహాయ నిధి ఏర్పాటు చేయాలి.జర్న లిస్టులకు సంక్షేమ నిధి (Welfare Fund) ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.
జిల్లా, మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా సమాన హక్కులు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.




