Armoor: కార్మికుల దైన్యస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఇటుక బట్టీలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి నేతృత్వంలో లేబర్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఆకస్మిక దాడులు నిర్వహించింది.
Armoor: కార్మికుల దైన్యస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
Armoor: లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆర్మూర్,ఆలూరు మండలాలలోని దేగం,మగ్గిడి గ్రామాలలోని ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులను బంధించి బలవంతంగా పనులు చేయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి,ఆర్మూర్ సీనియర్ న్యాయమూర్తి పి.శ్రీదేవి లేబర్, రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేసి ఇటుక బట్టి కార్మికులకు విముక్తి కల్పించారు.
గ్రామాలలో పనిచేస్తున్న ఇటుక బట్టి కార్మికుల దినస్థితిని చూసి జిల్లా న్యాయమూర్తి చలించి కన్నీరు పెట్టుకున్నారు.కార్మికులను ఒక్కొక్కరిగా పిలిచించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.రోజువారీగా పనిచేయని కార్మికులను రూమ్ లో బంధించి మహిళలను చితక భాదారని న్యాయమూర్తి దృష్టికి కార్మికులు తీసుకోవచ్చారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత్ లక్ష్మి:
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్మికులకు పనిచేయిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో ఉందని చెప్పారు.ఇటుక బట్టే కార్మికులకు కనీస వసతులు కల్పించకపోవడం, కనీస వేతనాలు చెల్లించకపోవడం, కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం, లేబర్ చట్టాలను పాటించకపోవడం కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
ఇటుక బట్టి క్యాంపు నుండి పారిపోయిన వ్యక్తి హైదరాబాదు లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారన్నారు.లేబర్ రికార్డ్స్ మైంటైన్ చేయకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడం పని చేయించడం స్పష్టంగా కనబడిందని చెప్పారు.1000 మంది పైగా ఇటుక బట్టి కార్మికులను రిస్క్యూ చేసి షెల్టర్ కల్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి , సదుపాయలతో పాటు వారికి రావాల్సిన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటుకబట్టి కార్మికులను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుక బట్టి యజమానులపై చట్టరిచ్ఛ చర్యలు తీసుకొని సీజ్ చేయవలసిందిగా ఎమ్మార్వో,సంబంధిత అధికారులకు ఆదేశించారు.




