Bichkunda: జుక్కల్ గులాబీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కీలక పిలుపు
Bichkunda: మద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మక సభ్యత్వ నమోదు (SRI) సన్నాహక సమావేశం.
Bichkunda: జుక్కల్ గులాబీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కీలక పిలుపు
బిచ్కుంద: బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టుతున్న (ఎస్ ఆర్ ఐ) సన్నాహక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జుక్కల్ బి ఆర్ ఎస్ పార్టీ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం మాట్లాడుతూ మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి పంక్షన్ హాల్ లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు,మాజి ఎమ్మెల్యే లు, జిల్లా నాయకులు, ఇంచార్జిలు హాజరు కానున్నారని షిండే అన్నారు.
జుక్కల్ నియోజకవర్గం లోని 8 మండలాల్లోని సర్పంచ్ లు,మాజి సర్పంచ్లు,మున్సిపల్ కౌన్సిలర్లు,మాజి ఎంపిపి లు,మాజి జడ్పి టి సి లు,సొసైటీ చైర్మన్లు,మార్కెట్ కమిటి మాజి చైర్మన్లు, వైస్ చైర్మన్లు,యూత్ సమన్వయ కమిటీ సభ్యులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం లో బిచ్కుంద మార్కెట్ కమిటి మాజి చైర్మన్ నల్చార్ రాజు, బి ఆర్ ఎస్ పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షుడు వెంకట్ రావు దేశాయ్ లు పాల్గొన్నారు.




