Jukkal: జుక్కల్ మండలం మహమ్మదాబాద్‌లో వైభవంగా 7వ రోజు బతుకమ్మ వేడుకలు!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్‌లో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 7వ రోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.

VEERANNA, JUKKAL
Published on: 18 Oct 2026 10:19 AM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ మండలం మహమ్మదాబాద్‌లో వైభవంగా 7వ రోజు బతుకమ్మ వేడుకలు!

Jukkal: నాటి తరాల నుండి సాంప్రదాయ పద్ధతి లో వస్తున్న బతుకమ్మ పండుగను ఈ గ్రామం లో మునుపేన్నాడు లేని విధంగా గ్రామ సర్పంచ్ చొరవతో మొట్టమొదటి సరిగా గ్రామం లొని ఆడ పడచులందరు ఒక చోట ఏకమై బతుకమ్మ సంబరాలు చేపట్టాడడంతో ఒక్కసారిగా గ్రామం దద్దారిల్లిపోయింది. అదే ఓ మారుమూల గ్రామీణ ప్రాంత గ్రామం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామం లో గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల బాలు (ప్రజ్ఞేష్ కుమార్ ) పాలక మండలి, గ్రామస్థుల ఆధ్వర్యంలో 7 వ రోజు చేపట్టిన బతుకమ్మ పండుగను గ్రామం లొని ఆడ పడచులందరు ఒకే చోట ఏకమై తీరొక్క పువ్వులతో బతుకమ్మ ను పేర్చి అందంగా అలంకరించి, మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున గ్రామం లొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆడబిడ్డల ఆత్మ బంధువు ఐన బతుకమ్మ వేడుకలను గ్రామస్థులందరు ఒక్కచోట చేరి బతుకమ్మ డి జె పాటలకు ఆడపడచులు ఉత్సహంగా స్టెప్పులస్తూ బతుకమ్మ ఆడడంతో గ్రామం లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకల్లో చిన్నారులు, ఆడపడచులు రంగురంగులతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి, కోలాటలు, ఆడుతూ మహిళలు సంతోషంలో మునిగిపోవడంతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగి తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టింది.

ఒకే రంగు చీరలో ఆడ పడచుల సందడి.

మొహమ్మద బాద్ గ్రామం లొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఒక్కొక్క మహిళ బృంద సభ్యులు ఓకే రకమైన చీరలు ధరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం తో కార్యక్రమం లో కళకళలడింది.చాల వరకు ఆడపడచులు ఒకటిగా ఈ వేడుకలకు ఆడ పడచులకు అవకాశం లభించడంతో తమ కెంతో ఆనందాన్ని ఇచ్చిందని పలువురు వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. తరాతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అలాంటి బతుకమ్మ పండుగను గ్రామస్థులంతా ప్రతి ఎట ఇలాగే సహకరిస్తే వచ్చే సంవత్సరం ఎవరు కానివిని ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు తను ముందుంటానని సర్పంచ్ పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో లైట్లు, మంచినీటి సదుపాయం, టిఫిన్ సదుపాయాలు కల్పించారు. ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు ఉత్సహభారీతంగా సాగయి.ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా అందంగా అలంకరించిన బతుకమ్మ లలో కొన్ని బతుకమ్మ లను ఉత్తమ బతుకమ్మ లుగా ఎంపిక చేసి మహిళల్లో మరింత ఉత్సహన్ని నింపేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా ఎంపిక చేసి వారిని నగదు రూపంలో బహుకరించారు. దానితోపాటు ఒకే రకమైన చీరలను ధరించిన మహిళ బృందలను మూడు బృందలుగా ఎంపిక చేసి వారిని సైతం నగదు బహుకరించడం జరిగింది. అనంతరం భజ భాజా భజంత్రీలతో గ్రామ చెరువు వద్దకు వెళ్లి ఎలాంటి అవంచానియా సంఘటనలు చోటు చేసుకోకుండ నిమ్మజనం చేశారు.కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ పి. లక్ష్మణ్, మాజి ఎంపి టి సి నాందేవ్, మాజి సర్పంచ్ బి. రాజగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె. రమేష్ దేశాయ్, దేవుకతే దేవురావు సార్,పట్వారి గంగాధర్, బేషిక్ గంగాధర్, సాయిలు సార్, ఎల్. గంగాధర్ మోహన్, ఖండ్ గొండ, తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL