Jukkal: జుక్కల్‌లో అహల్యాబాయి హోల్కర్ జయంతి

Jukkal: కాశీ, అయోధ్య ఆలయాలను పునర్నిర్మించిన మహోన్నత పాలకురాలని కొనియాడిన హాట్కర్ సమాజ్.

VEERANNA, JUKKAL
Published on: 31 May 2026 5:15 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్‌లో అహల్యాబాయి హోల్కర్ జయంతి

జుక్కల్: మహారాష్ట్ర లోని చోoడి లో 1725 లో జన్మించిన అహల్య బాయి హోల్కర్ మరాఠా సామ్రాజ్యం లో మాల్వా రాజ్యానికి చెందిన దర్శనిక రాణి అహల్య బాయి హోల్కర్ అని ఆమె చిన్ తనం లోనే వితంతువు అయినప్పటికీ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి సింహాసనాన్ని అధిష్టించి, ఏకంగా 30 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించిన మహా గొప్ప రాజా మత అహల్య బాయి హోల్కర్ అని జుక్కల్ నియోజకవర్గ హాట్కర్ సమాజ్ అధ్యక్షుడు నిలు పాటిల్ అన్నారు.

ఆదివారం జుక్కల్ మండల కేంద్రం లోని లాడేగవ్ రహదారి మూలమలుపు వద్ద అహల్య బాయి హోల్కర్ 301 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హాట్కర్ సమాజ్ నాయకులు ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మహిళా సాధికారత, సామాజిక సామరసతకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు.

తత్వవేత్త రాణి గా పూజించబడే ఆమె న్యాయమైన పరిపాలన, సైనిక రక్షణ తోపాటు విస్తృతమైన ఆలయ పునరుద్ధరణ కు ప్రసిద్ధి చెందారని గుర్తు చేశారు. మహిళల అభ్యున్నతికి అహల్య బాయి చేసిన సేవలు నేటికి ఆదర్శనీయమని నిలు పాటిల్ అన్నారు. భారత దేశంలోని కాశీ, అయోధ్య, సోమనాథ్ లాంటి అనేక ఆలయాలు విదేశీ దురాక్రమణదారుల దాడుల కారణంగా ధ్వంసమైనప్పుడు వాటిని మళ్ళీ పునర్నిర్మించి ,పునరుద్ధరించడంలో అహల్య బాయి హోల్కర్ విశేష కృషి చేశారని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఆమె పరిపాలన లో నిర్మించిన ఆలయాలు,ధర్మశాలలు నేటికి భక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం లో జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సతీష్ పాటిల్, సీనియర్ నాయకుడు గంగు నాయక్, అర్జున్ పాటిల్, గ్రామ కమిటి అధ్యక్షుడు క్రిష్ణ పాటిల్, ఖండు, రఘు, సంతు, మారుతి, దత్తు, గణేశ్, కాంబ్లీ కపిల్, నర్సింగ్, కుషాల్, ఖండు గోండ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story