Jukkal: జుక్కల్‌లో ఎరువుల దుకాణాలపై అగ్రికల్చర్ ఆఫీసర్ మెరుపు దాడులు: రూ. 2 లక్షల కాలం చెల్లిన మందులు సీజ్.. లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో వ్యవసాయ అధికారిణి మహేశ్వరి ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలపై మెరుపు దాడులు జరిగారు.

VEERANNA, JUKKAL
Published on: 30 May 2026 7:41 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్‌లో ఎరువుల దుకాణాలపై అగ్రికల్చర్ ఆఫీసర్ మెరుపు దాడులు: రూ. 2 లక్షల కాలం చెల్లిన మందులు సీజ్.. లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక!

జుక్కల్ (కామారెడ్డి జిల్లా): జుక్కల్ (కామారెడ్డి) మండల నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ మండల కేంద్రంలో శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారిని మహేశ్వరి అద్వర్యుఎరువుల దుకాణాలపై మెరుపు దాడి నిర్వహించారు.ఈ సందర్భంగా పలు ఎరువుల దుఃఖానాలపై అకస్మిక తనిఖీలు చేపట్టగా మండల కేంద్రంలో కొనసాగుతున్న సంగమేశ్వర ఆగ్రో పర్టిలైజర్ దుకాణం లో మొత్తం 25 లక్షల విలువ గల ఎరువులు, మందులు ఉన్నాయని వాటిని పరిశీలించగా అందులో 2 లక్షల విలువ గల కాలం చెల్లిన మందులను పట్టుకొని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వ్యవసాయ అధికారి తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మందులను సీజ్ చేసి ల్యాబ్ కు పంపడం జరిగిందని అన్నారు. జుక్కల్ మండలం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు లో ఉండడంతో ఆ ప్రాంతాలనుండి తీసుకొచ్చి రైతులకు విక్రయించే అవకాశం ఉందని పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఇక్కడి రైతులకు విక్రయించి రైతులకు నట్టేట ముంచే ఎ దుకాణం పైననైనా సరే దుకాణ యజమాని పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం వచ్చే ప్రతి రైతుకు ఒరిజినల్ బిల్లులు ఇవ్వాలని ఒరిజినల్ బిల్లులు ఇవ్వని పక్షంలో దుకాణ యజమాని పై రైతులనుండి ఎలాంటి పిర్యాదు లు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ చట్టం ప్రకారం దుకాణం, దుకాణం యజమాని పై కఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story