Jukkal: జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం కమిటీ ఎన్నిక

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా షేక్ ఫిర్దోష్, ప్రధాన కార్యదర్శిగా ఫైమ్ ఖాన్ ఎన్నిక.

VEERANNA, JUKKAL
Published on: 4 Aug 2026 2:27 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం కమిటీ ఎన్నిక

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం జుక్కల్ మండల కమిటి ని మంగళవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షుడు దుంపటి రాజు ఆదేశాల మేరకు నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల దుర్గ నరేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పూజారి గణేష్, జిల్లా కోశాధికారి బర్ల అనిత సాయిలు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బొమ్మల నాగరాజు మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ, గౌరవం తోపాటు అధికారల సాధనే ఫోరం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఇప్పటినుండి ప్రతి మండలంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉప సపంచుల సమస్యలను రాత్రి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వారి పరిష్కారం కోసం సమిష్టిగా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.అనంతరం మండల గౌరవ అధ్యక్షుడు షేక్ పీర్దోష్ మాట్లాడుతు ఉప సర్పంచుల చెక్ పవర్ అంశం పైప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసే శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలా పలకలపై సర్పంచ్ లతోపాటు ఉప సర్పంచుల పేర్లు కూడ తప్పనిసరిగా పొందుప్పర్చాలని కోరారు. ఉప సర్పంచులకు 5 వేలు, వార్డు సభ్యులకు 3 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ఉప సర్పంచులకు వాయిస్ చైర్మన్ హోదా కల్పించి సర్పంచ్ తో సమానంగా సంతకం చేసే అధికారాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ మండల స్థాయి అధికారిక కార్యక్రమానికి ఉప సర్పంచులను కూడ గౌరవ అతిథులుగా ఆహ్వాణించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన మండల కమిటి. జుక్కల్ మండల కేంద్రం లో మంగళవారం నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచుల మండల కమిటి సభ్యుల్లో మండల అధ్యక్షుడిగా షేక్ ఫిర్దోష్, ప్రధాన కార్యదర్శి గా పైమ్ ఖాన్ (పెద్ద ఏడ్గి ) ఉపాధ్యక్షుడిగా చౌహన్ సుధాకర్ (సావర్ గావ్ ) కోశాధికారీగా అనిల్ (బస్వాపూర్ )లు ఎన్నిక కాగ కార్యక్రమం లో మండలం లొని ఉప సర్పంచుల ఫోరం నాయకులు బాబు పాటిల్, అశోక్ పాటిల్, రాథోడ్ దానజీ యాదవ్, భీమ్ రావు, దాదా బాయి, అనిత, లక్ష్మి బాయి తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story