Jukkal: మొహమ్మదాబాద్ లో ఎల్ నినో ప్రభావం.. తీవ్ర తాగునీటి కొరత!
Jukkal: మొహమ్మదాబాద్ లో ఎల్ నినో వల్ల సింగూర్ ప్రాజెక్ట్ నీరు నిలిచిపోవడంతో, సర్పంచ్ శకుంతల ప్రజ్ఞ కుమార్ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు.
Jukkal: మొహమ్మదాబాద్ లో ఎల్ నినో ప్రభావం.. తీవ్ర తాగునీటి కొరత!
జుక్కల్: మొహమ్మద బాద్ (కామారెడ్డి) ఏలినోవా ప్రభావంతో ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవక పోవడంతో ఎగువ ప్రాంతాల చెరువులు నిండలేదు. దీంతో జుక్కల్ నియోజక వర్గానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే సింగూర్ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో జుక్కల్ మండలం లోని మొహమ్మద బాద్ గ్రామం లో తాగునీటి కొరత తలెత్తకుండా గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల ప్రజ్ఞ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు కాలనీలలో ట్యాంకర్ ల సహాయం తో తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామంలో ఎక్కడ నీటి సమస్య ఉన్న వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రస్తుతం నీటి వనరులు పరిమితంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ సూచించారు. అవసరమైనంత మేరకు నీటి సరఫరా కొనసాగించి గ్రామంలో నీటి ఎద్దడి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సర్పంచ్ స్పష్టం చేశారు.




