Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఘనంగా రాఖీ వేడుకలు!
Jukkal: రక్షాబంధన్ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు బ్రహ్మకుమారీలు, మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఘనంగా రాఖీ వేడుకలు!
జుక్కల్: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ మండల కేంద్రం లొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న గారు, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు జుక్కల్ఎమ్మెల్యేతోలక్ష్మీకాంతారావు కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాఖిలు కట్టిన వారందరికీ ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ప్రేమ, ఆప్యాయతలను నింపాలని ఆకాంక్షించారు.
అన్నాచెల్లెళ్లమధ్యప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఎమ్మెల్యే గారుపేర్కొన్నారు.కార్యక్రమంలో మహిళలు, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.




