Jukkal: కౌలాస్ నాలా వద్ద వరద పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
Jukkal: కామారెడ్డి జిల్లా కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం. ప్రాజెక్టును సందర్శించి, నీటి మళ్లింపు చర్యలు చేపట్టిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.
Jukkal: కౌలాస్ నాలా వద్ద వరద పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లో నీటి మట్టం గరిష్టస్థాయికిచేరువవుతున్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి కౌలాస్ నాలాప్రాజెక్ట్‌వద్దకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చేరుకున్నారు.
ప్రాజెక్ట్ వద్ద నెలకొన్న పరిస్థితిని అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్ట్‌లోకి వస్తున్న అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి మళ్లించేలా అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం, ప్రాజెక్ట్ పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయఘటనలుచోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వరద పరిస్థితినినిరంతరంపర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండాఅవసరమైనచర్యలుతీసుకోవాలనిసూచించారు.
ప్రజలభద్రతేలక్ష్యంగాఎమ్మెల్యేతోటలక్ష్మీకాంతరావుస్వయంగా రంగంలోకిదిగిపరిస్థితినిపర్యవేక్షించడం, అదనపు నీటి మళ్లింపునకు వెంటనే చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ దేశాయ్, యూత్ అధ్యక్షుడు సతీష్ పాటిల్, ప్రాజెక్ట్ ఏ ఇ సుకుమార్ రెడ్డి, మాజి సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.




