Jukkal: బస్సు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
Jukkal: జుక్కల్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద క్షతగాత్రులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరామర్శించారు.
Jukkal: బస్సు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
జుక్కల్: జుక్కల్ మండలం కేంరాజ్ కల్లలి గేట్ సమీపంలోని161వద్దజరిగినఆర్టీసీబస్సుప్రమాదంలో గాయపడి బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నక్షతగాత్రులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపరామర్శించారు.వారిఆరోగ్యపరిస్థితినిఅడిగితెలుసుకున్నారు.
అనంతరం ఆయనమీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. డ్రైవర్ కుటుంబంలో ఒకరికిప్రభుత్వఉద్యోగంఇప్పించేందుకుచర్యలుతీసుకుంటామని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యంఅందించడంతో పాటు బాధిత కుటుంబాలకు అవసరమైనసహాయసహకారాలుఅందేలాచర్యలుతీసుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతెలిపారు.అస్పత్రి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులనుఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నారు.




