Bichkunda: ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది.. జుక్కల్ ఎమ్మెల్యే కీలక ప్రకటన
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
Bichkunda: ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది.. జుక్కల్ ఎమ్మెల్యే కీలక ప్రకటన
బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి)రైతుల శ్రేయస్సు కోరి ప్రభుత్వం నిర్ణయించిన మొక్క జొన్న పంట కు క్వింటాలుకు 2 వేల 400 వందల రూపాయల మద్దతు ధర కల్పించినందున ప్రతి రైతు తమ పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకొని లాభ పడాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు రైతులకు సూచించారు. బిచ్కుంద మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతు సేవ సహకార సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ మార్క్ఫైడ్ సౌజన్యం తో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు మధ్య దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలని రైతులను కోరారు.
మొక్క జొన్న పంట తోపాటు జొన్న పంట ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మండలాల వారిగా కొనుగోలు కేంద్రాల వివరాలను వెల్లడించడం జరిగిందని రైతులెవ్వరు అధైర్య చెందాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా కల్పిస్తూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు కావలసిన మద్దతు ధర కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పంట విక్రయం లో దళారుల మాటలను నమ్మకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులకు సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి రైతు తమ పంటను వర్షపు నీటికి తడవకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలని తెలిపారు.కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ కొంగల శంకర్, రైతు సేవ సహకార సంఘం చైర్మన్ నల్చార్ బాలు శ్రీహరి, వైస్ చైర్మన్ యాదవ్ రావు,సి ఇ ఓ శ్రవణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగ్ నాథ్, సర్పంచ్ లు గోపాల్ రెడ్డి, జై పటేల్, రాజు పాటిల్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




