Jukkal: పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.. ఎమ్మెల్యే తోట క్లారిటీ
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బిజ్జల్‌వాడిలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు.
Jukkal: పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.. ఎమ్మెల్యే తోట క్లారిటీ
Jukkal: బిజ్జల్ వాడి (కామారెడ్డి) జుక్కల్ మండలం బిజ్జల్ వాడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ప్రతి కుటుంబానికి స్థిర నివాసం కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.
ప్రతి పేద వాడికి ఇళ్లు ఇచ్చి వారి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. నియోజకవర్గం లొ ఎ గ్రామమైన సరే అర్వులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఇళ్లు నిర్మించుకునే విధంగా తమ వంతు కృషి చేస్తానని అన్నారు. అర్వులైన ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్ దేశాయ్, యూత్ అధ్యక్షుడు సతీష్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఆయిల్వర్ రమేశ్, మనోహర్ పాటిల్, మధు పాటిల్, బాలాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.




