Nizamsagar: నిజాంసాగర్ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ విరాళం.. ప్రారంభించిన ఎమ్మెల్యే
Nizamsagar: నిజాంసాగర్ ప్రభుత్వ కాలేజీకి ఎన్నారై భాస్కర్ రెడ్డి రూ.84 వేల కంప్యూటర్ విరాళం. ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ చీఫ్ మల్లికార్జున్.
Nizamsagar: నిజాంసాగర్ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ విరాళం.. ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంసాగర్: నిజాంసాగర్ (కామారెడ్డి) కామారెడ్డి డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆత్మీయ మిత్రుడు, బాల్య స్నేహితుడు, ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటుగా తన స్వంత నిధులతో 84 వేల విలువ చేసే కంప్యూటర్ ను విరాళంగా అందించారు.
నూతన కంప్యూటర్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు రిబ్బన్ కట్ చేసి కంప్యూటర్ ను ప్రారంభించారు. కంప్యూటర్ ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యే, డి సి సి అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచం లో విద్యార్థుల భవిష్యత్తు కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తు లో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాక్షించారు.
సమాజ సేవ దృక్పథం తో విద్యార్థుల కోసం ముందుకొచ్చిన ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి సేవ భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్య సంస్థ లకు సహకరించే దాతలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
విద్య రంగ అభివృద్ధికి ఇలాంటి సేవ కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాక్షించారు. విద్యార్థులకు కంప్యూటర్ వితరణ చేసిన ఎన్నారై భుజం గారి భాస్కర్ రెడ్డి కి జుక్కల్ ఎమ్మెల్యే తోట, డి సి సి అధ్యక్షుడు,కళాశాల ప్రిన్సిపల్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల అధ్యాపకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




