Jukkal: ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార దినాన్ని పరిశీలించిన అధికారులు

Jukkal: జుక్కల్ మండలంలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార దినం పరిశీలన. కొత్త ఓటర్ల నమోదు, మార్పుల దరఖాస్తులను పరిశీలించిన డిప్యూటీ తహసీల్దార్ హేమలత.

VEERANNA, JUKKAL
Updated on: 12 Sept 2026 11:16 PM IST
Jukkal
X

Jukkal: ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార దినాన్ని పరిశీలించిన అధికారులు

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి ) ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార దినం సందర్భంగా జుక్కల్ మండలంలోని 82, 83, 84, 85 పోలింగ్ కేంద్రాలను జుక్కల్ మండల డిప్యుటీ తహసీల్దార్ హేమలత ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేకసవరణకార్యక్రమాన్ని పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పులు, తొలగింపులు, చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను పరిశీలించారు.

ప్రత్యేక ప్రచార దినాన్ని సద్వినియోగంచేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులుప్రజలకుసూచించారు.

కార్యక్రమం లో డిప్యుటీ తహసీల్దార్ హేమలత, మాజి మార్కెట్ కమిటి చైర్మన్ కె.సాయాగౌడ్,సీనియర్ అసిస్టెంట్ సి హెచ్. అంజయ్య, సూపర్ వైజర్ సాయి ప్రసాద్, జి పి ఓ. శ్రీకాంత్ లతోపాటు బి ఎల్ ఓ లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL