kamareddy: బస్వాపూర్‌లో వీధి కుక్కల దాడి గొర్రెలు మృతి, వేలల్లో నష్టం!
kamareddy: జుక్కల్ మండలం బస్వాపూర్‌లో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో గొర్రెలు మృతి చెందాయి. కుక్కల బెడదను నివారించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
kamareddy: బస్వాపూర్‌లో వీధి కుక్కల దాడి గొర్రెలు మృతి, వేలల్లో నష్టం!
పొలం గట్లపై పండ్ల మొక్కలు
వినూత్నంగా 'గట్టుమీద చెట్టు' కార్యక్రమం
కొమరాడ, జూలై 26 : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామంలో ఆదివారం 'గట్టుమీద చెట్టు' కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచనల మేరకు, జిల్లా వ్యవసాయ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, స్థానిక రైతుల భాగస్వామ్యంతో ఈ మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులు నాగభూషణరావు, జగన్నాధంనాయుడులకు చెందిన సుమారు 1.15 ఎకరాల తన పొలం గట్లపై అధికారులు, రైతులు కలిసి వినూత్నంగా గోతులు తీసి పండ్ల మొక్కలను నాటారు. ఉసిరి, జామ, మామిడితో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను నాటడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతూ, వ్యవసాయ భూముల్లోని గట్లను వృథా చేయకుండా ఈ విధంగా పండ్ల మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని స్పష్టం చేశారు. అనంతరం 'గట్టుమీద చెట్టు' ప్రయోజనాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
అధికారుల చొరవతో ప్రేరణ పొందిన గ్రామంలోని ఇతర రైతులు కూడా తీవ్ర ఉత్సాహం వ్యక్తం చేశారు. తమ పొలాల గట్లపై కూడా ఇదే రీతిలో పండ్ల మొక్కలు నాటుతామని వారు సంతోషంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




