Jukkal: తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి: ఎమ్మెల్సీ కోదండరామ్‌కు 'జుక్కల్' ఉద్యమకారుల విన్నపం!

Jukkal: జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ కోదండరామ్‌కు బొర్గి సంజీవ్ వినతిపత్రం సమర్పించారు. ప్రతి ఉద్యమకారుడికి 200 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 7 May 2026 7:50 PM IST
Jukkal
X

Jukkal: తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి: ఎమ్మెల్సీ కోదండరామ్‌కు 'జుక్కల్' ఉద్యమకారుల విన్నపం!

జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి) తెలంగాణ ఉద్యమ కారులను ప్రభుత్వం ఆధుకునే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ తెలంగాణ పోలీస్ ఉద్యమ కారుడు బొర్గి సంజీవ్ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్. కోదండ రామ్ ను కోరారు. ఈ సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ సమావేశంలో జుక్కల్ నియోజకవర్గం తరపున హాజరై తెలంగాణ ఉద్యమ కారుల గోడును వినిపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యమ కారులను ఆదుకోకుంటే తెలంగాణ పాలకుల కన్నా ఆంధ్ర ప్రదేశ్ పాలకులే గొప్పవారని అన్నారు.

జుక్కల్ నియోజకవర్గ ఉద్యమ కారులకు ప్రభుత్వం ద్వార ప్రతి ఒక్కరికి 200 గజాల స్థలం ఇప్పించేలా కృషి చేయాలని అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ఉద్యమ కారుల వివరాలను వినతిపత్రం ద్వార అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యమ కారుల ఆవేదన, ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారందరికీ న్యాయం జరిగే విధంగా త్వరితగతిన ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమ కారులను ఎంపిక చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మలి దశ, తొలి దశ ఉద్యమ కారులను, అమర వీరుల కుటుంబాలను, కళాకారులను అదుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story