Jukkal: ఆర్మూర్ స్కూల్లో ఉర్దూ ఉపాధ్యాయుడిపై దాడి
Jukkal: ఆర్మూర్ లోని భారత్ చంద్ర పాఠశాల ఉర్దూ ఉపాధ్యాయుడు అమర్ పై జరిగిన దాడిని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఉర్దూ కమ్యూనిటీ తీవ్రంగా ఖండించింది.
Jukkal: ఆర్మూర్ స్కూల్లో ఉర్దూ ఉపాధ్యాయుడిపై దాడి
Jukkal: జుక్కల్ (కామారెడ్డి) ఆర్మూర్ పట్టణం లోని భారత్ చంద్ర పాఠశాల లో విధులు నిర్వహిస్తున్న ఉర్దూ ఉపాధ్యాయుడు అమర్ పై జరిగిన దాడి సంఘటన ను జుక్కల్ ఉర్దూ కమ్యూనిటీ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుడిని చెంప దెబ్బ కొట్టి, వేధింపులకు గురి చేసిన ఈ ఘటన అత్యంత విచారించదగ్గ విషయమన్నారు.
వైరల్ వీడియోలో అమర్ ను ఒక గుంపు పథకం ప్రకారం చుట్టుముట్టి దాడి చెయ్యడం స్పష్టంగా కనిపిస్తుందని ఈ ఘటన మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగిందని వెలువడుతున్న సమాచారం ఉపాధ్యాయుల భద్రతతోపాటు చట్ట అమలు పై తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని ఈ ఘటన పై జుక్కల్ మండలం ఉర్దూ కమ్యూనిటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తూ,
విధులను నిర్వహిస్తున్న ఏ ఉపాధ్యాయుడిని హింస, బెదిరింపులు, ప్రజా అవమానానికి గురి చెయ్యకూడదని పేర్కొన్నారు. ఈ ఘటన లో బాధ్యులైన వారందరిపై తక్షణం కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై జుక్కల్ ఉర్దూ కమ్యూనిటీ ఉపాధ్యాయ వర్గానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఉపాధ్యాయుల భద్రత, గౌరవం రక్షణ ను ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ధారించాలన్నారు.




