Nizamsagar: పేదింటి ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే తోట

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

VEERANNA, JUKKAL
Published on: 29 May 2026 12:17 PM IST
Nizamsagar
X

Nizamsagar: పేదింటి ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే తోట

నిజాంసాగర్: కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక భారం తగ్గించేందుకు గాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. శుక్రవారం జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్థానిక నాయకులతో కలిసి కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అర్హుల ముఖాల్లో ఆనందమే తమ విజయానికి నిదర్శనం అన్నారు.

అర్హులైనప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రజా పండరి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచ్లు బ్రహ్మం, పోచయ్య, గుర్రపు సుమిత్ర శ్రీనివాస్, దుర్గయ్య శ్రీనివాస్ రెడ్డి, రాజారాం, అజయ్ కుమార్ లతోపాటు కల్యాణలక్ష్మి, షాది ముభారక్ లబ్ధిదారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story