Nizamabad: మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం.. హెచ్‌ఎం సస్పెండ్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా కమలాపూర్ జెడ్పీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం అమర్ సింగ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు.
Nizamabad: మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం.. హెచ్‌ఎం సస్పెండ్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో పాటు ఫిర్యాదులు అందాయి.
దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించగా, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు.విద్యార్థుల సంక్షేమ పథకాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.




