Mohammadabad: ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన.. సబ్సిడీ విత్తనాలు
Mohammadabad: కామారెడ్డి జుక్కల్ మొహమ్మదాబాద్లో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన; ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపు, సబ్సిడీ విత్తనాలు, పశుగ్రాస ప్రోత్సాహకాలపై సూచనలు.
Mohammadabad: ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన.. సబ్సిడీ విత్తనాలు
మొహమ్మద బాద్: మొహమ్మద బాద్ (కామారెడ్డి ) ప్రస్తుత యాసంగి పరిస్థితి లో అన్నదాతలు అరుతడి పంట సాగు పై ఆసక్తి చూపాలని సోమవారం ఇంచార్జి మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ పంచాయతీ సమావేశ హల్ లో గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞేష్ కుమార్ (బాలు సార్ ) అధ్యక్షతన గ్రామ రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతు ఎలినో ప్రభావం వల్ల వర్షభావ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని రైతులు అప్రమత్తంగా ఉంటు అరుతడి పంటలైన మొక్క జొన్న,శనగ, ప్రొద్ధు తిరుగుడు, జొన్న, కుసుమ, కూరగాయలు లాంటి పంటలు సాగు చేయాలని రైతులకు పలు సూచనలు చేశారు. ఒక ఎకరం వరి పండించే నీటితో 4 నుండి 5 ఎకరాలు అరుతడి పంటలు పండించవచ్చన్నరు.
రైతులు సాగు చేసే శనగ, మినుము, పొద్దు తిరుగుడు విత్తనాలు సబ్సిడీ పైన అందుబాటులో ఉన్నాయని విత్తనాలు కావాల్సిన రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దింతోపాటు వి బి జి రామ్ జి కింద పశువుల మేత కోసం వేసుకునే రైతులకు ఎకరానికి 1400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
పంట సాగులో పంటకు అవసరమైన మొతదులో మాత్రమే ఎరువులను వాడాలని ఎక్కువ మొతదులో వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బ తిని పంట దిగుబడి తగ్గిపోయి రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతులకు సూచించారు.కార్యక్రమం లో ఉప సర్పంచ్ పోతుల లక్ష్మణ్, వ్యవసాయ విస్తరణ అధికారి ఛిద్రవర్ సతీష్, మాజి సర్పంచ్ బి. రాజగౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్, ఎల్. రాములు,టి.హన్మారెడ్డి,బేసిక్స్ గంగాధర్, పట్వారి గంగాధర్, పెర్సెట్టి గంగాధర్ తోపాటు రైతులు పాల్గొన్నారు.




