Kamareddy: నిజాంసాగర్ నీళ్లు కేవలం తాగడానికే: ఎమ్మెల్యే పోచారం!

Kamareddy: నిజాంసాగర్ నీరు కేవలం తాగునీటి అవసరాలకేనని, ఎల్‌నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలనే సాగు చేసుకోవాలని కామారెడ్డి బీర్కూర్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

SALEEM, BANSWADA
Updated on: 4 Nov 2026 11:38 PM IST
Kamareddy
X

Kamareddy: నిజాంసాగర్ నీళ్లు కేవలం తాగడానికే: ఎమ్మెల్యే పోచారం!

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు.ప్రజలు నిర్మించిన కైన మండపం లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్మినో అనే భూతం మన మీదకు వచ్చిందని, దాని ప్రభావం మన రాష్ట్రంలోనే కాకుండా, దేశం లో అన్ని రాష్ట్రాలతో పాటు, యావత్తు ప్రపంచం మీద ప్రభావం చూపిందని, ఈ ఏటా వర్షం తక్కువ శాతం కురిసిందని.

దాని వల్ల ప్రాజెక్టుల్లో నీటి నిలువలు పెరగలేదని, ఉన్న కొద్ది పాటి నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు త్రాగటానికి వినియోగించాలని నిత్యం తీసుకుందని వివరించి చెప్పారు. కావున రైతులు ఆరుతడి పంటలను ఎంపిక చేసుకొని,వాటిని మాత్రమే వేసుకోవాలని సూచన చేశారు.నీటి లభ్యతను పూర్తిగా లెక్క వేసుకుని,రైతులు పంటలు వేసుకుంటే రానున్న కాలం లో నష్టపోకుండా ఉండేవిధంగా ఉంటుందని రైతులకు సూచించారు. ఉన్న నీటిని చాలా ఒడిసి పట్టుకుని,పొదుపుగా వాడుకోవాలని అన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA