Bichkunda: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత రాథోడ్ సునీత!
Bichkunda: తెలంగాణలో బీజేపీ ఎక్కడుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కామారెడ్డి బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సునీత మండిపడ్డారు.
Bichkunda: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత రాథోడ్ సునీత!
బిచ్కుంద (కామారెడ్డి): తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎక్కడుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కామారెడ్డి జిల్లా బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సునీత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి ఎక్కడుందో తెలుసుకోవాలంటే కామారెడ్డి గడ్డకు వచ్చి చూడాలని, ప్రజలే బిజెపి బలం ఏంటో చూపిస్తారని అన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటేపల్లి వెంకట రమణ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయి బిజెపి అభ్యర్థి గెలిచి కాషాయ జెండా ఎగిరేసిన విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఇది గుర్తు పెట్టుకోవాలని అన్నారు.ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం కొడంగల్ లో 2024 లోకసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ బిజెపి ఏం పి డి కె అరుణ కు 62.560 ఓట్లు వచ్చాయని తెలిపారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గం లొనే బిజెపి పార్టీ కి ఇంతటి ఆదరణ లభించడం పార్టీ బలానికి నిదర్శనమని అన్నారు. ఒక ఉన్నత స్థాయి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు చేయడం మానుకొని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ద్రుష్టి పెట్టాలని రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఏగూరవెయ్యడం ఖాయమని ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.




