Kamareddy: పెద్ద కొడప్‌గల్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం!
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లో బిజెపి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
Kamareddy: పెద్ద కొడప్‌గల్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం!
Kamareddy: పెద్ద కొడప్ గల్ ( కామారెడ్డి) దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాస ముట్టడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల కమిటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద బిజెపి మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ దేశంలో కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతోనే రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించాయని ఆరోపించారు. నీట్ పరీక్షల అంశాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాలు, దేశ వ్యతిరేక శక్తులు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఒకవైపు దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తుంటే మరోవైపు దేశంలో అశాంతిని రాజేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని విమర్శించారు. ఇలాంటి విచ్చిన్నకార రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని , రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమం లో సంజయ్ పాటిల్, క్రిష్ణ పంతులు, హన్మండ్లు, నాందేవ్, మోహన్, ఇందాల్, యువ నాయకులు తనజీ రావు, చిప్ప రామేసుతోపాటు బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




