Kamareddy: మున్సిపల్ సమస్యలపై కలెక్టరేట్‌లో BRS కౌన్సిలర్ల వినతిపత్రం!
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో BRS కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం సమర్పించారు.
Kamareddy: మున్సిపల్ సమస్యలపై కలెక్టరేట్‌లో BRS కౌన్సిలర్ల వినతిపత్రం!
కామారెడ్డి: ఈరోజకామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ గారికి మరియు లోకల్ బాడీస్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ వై వి గిరి గారికి మున్సిపల్ సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
మునిసిపల్ లో జరుగుతున్న పరిణామాలు మున్సిపల్ మీటింగ్లు సక్రమంగా నిర్వహించడం లేదు మున్సిపల్ వార్డుల్లో గత ఆరు నెలల నుండి చెత్తను సేకరించుటకు తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుచున్నందున కొత్త ఆటోలను కొనుగోలు చేయుటకు తమరి అనుమతి వెంటనే ఇవ్వగలరని కోరనైనది.
మున్సిపల్ జెసిబి ని కామారెడ్డి పురపాలక చైర్మన్ గారి భర్త ఆధీనంలో ఉంచుకొని నడిపించడం జరుగుతుంది. కావున జెసిబి ని బాధ్యత గల మున్సిపల్ అధికారి ఆధీనంలో ఉండేటట్లు చూడగలరు. మున్సిపల్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ సిబ్బందిపై అజమాయిషీ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోగలరని కోరనైనది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేసిన మొరం టెండర్ల విషయంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై తగు చర్యలు తీసుకోగలరని కోరనైనది.
మునిసిపల్ అధికారుల మధ్య సమన్వయం లోపించినందున కామారెడ్డి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ BRS పార్టీ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.




