Banswada: దుర్గంపల్లిలో భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో!
Banswada: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్గంపల్లి, బాన్సువాడ మండలం వాసుదేవపల్లి గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ సర్వే పనులను బాన్సువాడ ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Banswada: దుర్గంపల్లిలో భూముల రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో!
Banswada: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్గంపల్లి గ్రామంలో, బాన్స్వాడ మండలం వాసుదేవపల్లి గ్రామంలో చేపడుతున్న రీ సర్వే పనులను బాన్సువాడ ఆర్డీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోతో పాటు నస్రుల్లాబాద్ తహసీల్దార్ కూడా పాల్గొని గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భూముల రీ సర్వే పనులు సక్రమంగా, పారదర్శకంగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్వేకు సంబంధించిన రికార్డులు, హద్దులు, భూముల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.




