Kamareddy: అన్నదాతలపై కాంగ్రెస్ కుట్ర.. సర్కార్‌పై ఎమ్మెల్యే ఫైర్

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.

VEERANNA, JUKKAL
Published on: 29 May 2026 6:43 PM IST
Kamareddy
X

Kamareddy: అన్నదాతలపై కాంగ్రెస్ కుట్ర.. సర్కార్‌పై ఎమ్మెల్యే ఫైర్

Kamareddy: 30 నెలల్లో జుక్కల్ అభివృద్ధి శూన్యం మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మద్నూర్ (కామారెడ్డి) బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టుతున్న ఎస్ ఐ ఆర్ సన్నాహక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రం లోని మైధిలి పంక్షన్ హాల్ లో జుక్కల్ బి ఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ అతిరథ మహారథులు పాల్గొన్నాన్నారు. జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి భిక్షపతి,మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జజుల సురేందర్,మాజి ఎమ్మెల్సీ వి జి గౌడ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించారు. సమావేశం లోముఖ్య అతిథిగా పాల్గొన్న మాజి మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మట్టిలో కలిసి పోవడం ఖాయమని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నల పంటలు కొనుగోలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై కుట్ర పూరిత చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి అధికారం లోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దోచుకోవడం దోచుకున్నది దాచుకోవడానికి మాత్రమే పరిమితమైందని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రైతుల పంటలు చేతికి రాగానే వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార కొనుగోలు చేసి న వారం రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీ దేనాని గుర్తు చేశారు. అదే నేడు ఆ అన్నదాతలు తాము పండించిన పంటలు విక్రయించేందుకు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల ద్వార పడిగాపులు గస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని దుయ్య బట్టరు.

30 నెలల కాంగ్రెస్ పాలనలో జుక్కల్ అభివృద్ధి శూన్యం.

ఇక కాంగ్రెస్ 30 నెలల పాలనలో జుక్కల్ నియోజకవర్గం లొ అభివృద్ధి పూర్తి శూన్యమని తమ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన పనులు సైతం పూర్తి చేయలేకపోతున్న దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని, రాష్ట్రంలో రాబోయేది మళ్ళీ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వమని పేర్కొన్నారు.

జుక్కల్ నియోజకవర్గం లొ గత 45 ఏండ్లలో జరుగని అభివృద్ధి పనులు కేవలం 15 సంవత్సరాల హనుమంత్ షిండే పాలనలో జరిగిందని కితాబిచ్చారు. కాని ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎం పి, ఎమ్మెల్యే లు, బిజెపి ఎంపి, ఎమ్మెల్యే లు ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారని రైతులకు న్యాయం జరగాలంటే ఆది బి ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు.

కార్యక్రమం లో ఉమ్మడి జిల్లాల మాజి జడ్పి చైర్ పర్సన్ దాపేధర్ రాజు, మాజి ఎంపిపి లు ప్రతాప్ రెడ్డి,విజయ్, బస్వంత్ సెట్కార్,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ లు నల్చార్ రాజు, మల్లికార్జున్ ,గైని విఠల్, యశోద నిలు పాటిల్, బొల్లి గంగాధర్,వైస్ చైర్మన్లు, మాజి సింగిల్ విండో చైర్మన్లు, పండిత్ రావు పాటిల్, పాకాలి విజయ్, మాజి సి డి సి చైర్మన్ దుర్గారెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజి సర్పంచ్లు, ఎంపి టి సి లు, మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పాటిల్, వెంకట్ రావు దేశాయ్, యువ నాయకులు క్రిష్ణ పాటిల్, తుమ్మ హన్మండ్లు లతోపాటు నియోజకవర్గం లోని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story