Kamareddy: కామారెడ్డి జిల్లాలో దాబాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న దాబాలు, హోటళ్లలో ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు.

MADHU, KAMAREDDY
Published on: 5 Aug 2026 3:38 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలో దాబాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

కామారెడ్డి: దాబాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 8 చోట్ల తనిఖీలు.. జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం దోమకొండ సర్కిల్ పరిధిలో పలుచోట్ల దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారిపై గల దాబాలతో పాటు పలు హోటలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు మద్యం సీ ట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

దాబాల వద్ద మద్యం సిట్టింగ్ లేదు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డాబాలు హోటల్లో మద్యం సేవిస్తే నిర్వాకులపై కేసులు ఉంటాయని తెలిపారు.

ఎక్కడైనా మద్యం సేవిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్సై వీ దీపిక తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీకాంత్ రామరాజు షాబుద్దీన్లు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story