Kamareddy: కాచాపూర్‌లో పండుగ వాతావరణం.. ఇందిరమ్మ గృహప్రవేశాల సందడి!
Kamareddy: భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. పాల్గొన్న సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి.
Kamareddy: కాచాపూర్‌లో పండుగ వాతావరణం.. ఇందిరమ్మ గృహప్రవేశాల సందడి!
కామారెడ్డి జిల్లా: భిక్కనూరు మండలం కాచాపూర్ లో నూతన ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్, ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు ఘనంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
అనంతరం సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ...
బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలలో భాగమైన ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు చెందడం ఎంతో సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు.
Next Story




