Jukkal: కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు సహించం: మాజీ ఎమ్మెల్యే షిండే!

Jukkal: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 5 Nov 2026 10:56 PM IST
Jukkal
X

Jukkal: కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు సహించం: మాజీ ఎమ్మెల్యే షిండే!

జుక్కల్: బిచ్కుంద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్ళ పోరాటం చేసి, తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కె సి ఆర్ అని అలాంటి మహానేత గురించి మాట్లాడేటప్పుడు కనీసం రాజకీయ సంస్కారం ఉండాలని కె సి ఆర్ పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను జుక్కల్ బి ఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే షిండే తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యం లో ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది. కానీ వ్యక్తిగత జీవితం పై దిగజారి మాట్లాడటం రాజకీయ జీవితం పై నాయకుడి స్థాయిని తెలియజేస్తుందని కె సి ఆర్ తెలంగాణ కు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, రైతుల కోసం తీసుకోచ్చిన కార్యక్రమాల గురించి మాట్లాడే ధైర్యం లేక వ్యక్తిగత విమర్శలకు దిగడంసరికాదన్నారు.

జుక్కల్ నియోజకవర్గం లో రైతుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు, రోడ్ల దుస్థితి, సాగునిటి సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పై లేదా నని ప్రశ్నించారు. ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేది ప్రజలకు అండగా ఉంటు నియోజకవర్గం అభివృద్ధి కోసమే కానీ వ్యక్తిగత విమర్శలు చేయడానికి కాదని అన్నారు.

ఇప్పటికైనా జుక్కల్ ఎమ్మెల్యే తోట వ్యక్తి గత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టాలని హితావు పలికారు. తెలంగాణ ఆత్మగౌరవనికి ప్రతీక అయిన కె సి ఆర్ పై అనుచిత వ్యాఖ్యలను జుక్కల్ బి ఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే తీవ్ర స్థాయిలో ఖండించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL