Jukkal: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్!
Jukkal: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత: రేపు ఉదయం వాగులోకి 1000 క్యూసెక్కుల నీటి విడుదల. దిగువ పరివాహక గ్రామాల ప్రజలకు నీటిపారుదల శాఖ హై అలర్ట్ జారీ.
Jukkal: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్!
జుక్కల్: కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి వరద నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో రేపు ఉదయం 9 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి సుమారు 1000 క్యూసెక్కుల నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఏ ఇ లు అశ్విని, సుకుమార్ రెడ్డి లు తెలిపారు.
దీంతో కౌలాస్ నాలా వాగు దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చేపలు పట్టేవారు, రైతులు, గొర్రెలు, పశువుల కాపరులు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే పశువులు, ఇతర మూగజీవులను కూడా వాగు పరివాహక ప్రాంతంలోకి వెళ్లనివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి నీటిపారుదల శాఖ, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రాజెక్ట్ అధికారులు కోరారు.




