Jukkal: తండాలో చేతి పంపు మరమ్మత్తు.. తీరిన తాగునీటి కష్టాలు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ తండాలో చేతి పంపుకు సర్పంచ్ శకుంతల ప్రజ్ఞ కుమార్ మరమ్మత్తులు చేయించడంతో తీరిన తాగునీటి కష్టాలు.
Jukkal: తండాలో చేతి పంపు మరమ్మత్తు.. తీరిన తాగునీటి కష్టాలు!
Jukkal: మొహమ్మదాబాద్ (కామారెడ్డి ) జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో గత కొద్ది రోజులుగా చేతి పంపు చెడిపోవడంతో తాగునీటి కోసం తండావాసులు తీవ్రఇబ్బందులుఎదుర్కొన్నారు.విషయం గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞ కుమార్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు.
చెడిపోయిన చేతి పంపుకు సత్వరమే మరమ్మత్తులు చేయించి, తండావాసులకు తిరిగి తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కొద్దిరోజులుగా నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తొలగడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.
తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి చేతి పంపును మరమ్మత్తు చేయించిన గ్రామ సర్పంచ్‌కు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




